Latest Entries »

తెలుగు బ్లాగరులందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు!! స్వామి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను!

Don’t whisper a word. The whole world will be able to hear you. Wankhede is stunned into silence. Rampaul spoils the party, Sammy holds the catch at second slip. Rampaul goes on a celebratory run. Short, not too wide, bounces rib-high, Tendulkar wants to punch, but ends up opening the face on it. Sammy takes a sharp catch at second slip. Five Tests ago he had dropped Dravid in the same position for the man to score a match-winning century. Not today. Just a sigh from Tendulkar as he walks back. A slight grimace towards the end of the walk, looks at the crowd, looks at bat. Walks off. he still has 30 more centuries than the next best…

-కిరణ్

Copy – Paste

ఎండా కాలం మొదలయింది కదా…వర్షం పడుతోంది బయట. ఇప్పుడు మీకో జోకు :)
ఒక ప్రఖ్యాత మానసిక వైద్యుణ్ణి మా ఆఫీసు లో ఉపన్యాసానికి పిలిచారు. కొంతసేపు అనుభందాల గురించి మాట్లాడిన ఆయన “నేను నా జీవితం లోని మధుర క్షణాలన్నీ ఒక స్త్రీ కౌగిట్లో గడిపాను. కాని ఆమె నా భార్య కాదు” అని ఆపాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం!!
“ఆమె నా తల్లి” అన్నాడు రెండు క్షణాల తరువాత. అంతే ఆ గది అంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
ఒక వారం తరువాత మా మానేజర్ ఇంట్లో చిన్న పార్టీ. ఒక రెండూ పెగ్గులు పడ్డాక ఆయనకి మానసిక వైద్యుడి జోకు గుర్తొచ్చింది. వెంటనే  ”నేను నా జీవితం లోని మధుర క్షణాలన్నీ ఒక స్త్రీ కౌగిట్లో గడిపాను. కాని ఆమె నా భార్య కాదు” అని ఆపాడు. వాళ్ళావిడ మొహం లో అప్పటిదాకా ఉన్న చిరునవ్వు పోయి కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఒక ౨౦ సెకన్ల తరువాత అందరి మొహాల్ని దొంగలా చూసి “….ఆమె ఎవరో నాకు గుర్తురావట్లేదు” అన్నాడు జోకు తరువాయి భాగం గుర్తు రాక!

Moral of the story: Don’t copy if you can’t paste .!

 

భోగి మంటలు

రంగవల్లులు

అమ్మ చేతి పిండివంటలు

గంగిరెద్దులు 

హరిదాసులు

రంగురంగుల పతంగులు

వచ్చేసింది సంక్రాంతి… మీకు మీ కుంటుంబ సభ్యులందరికి

 


 

 

దోపిడి

చాలా రొజులనుండి టపా రాద్దామనుకుంటున్నా. కాని ఈ రోజు ఇలా కోపంలో ఉన్నప్పుడు రాస్తానని అనుకొలేదు.

ఇవాళ ఉదయం ఆఫీసుకెళ్ళేముందు బండిలో పెట్రోలు కొట్టిద్దామని యూసుఫ్ గూడ దగ్గరున్న పెట్రోలు బంకులోకెళ్ళాను (భారత్ పెట్రోలియం అనుకుంటా). 200 కి కొట్టమని చెబితే ‘పచాస్ కా ‘ అని చెప్పి 50 ప్రెస్స్ చేసి కొట్టెస్తున్నాడు. ‘పచాస్ నహి. దో సౌ కా దాలో ‘ అన్నా. నా ముందే ఇంకో 100 ప్రెస్స్ చేసి 150 దాక కొట్టాడు. ‘అదేంటి..నేను చెప్పింది..200 కదా’ అంటే ‘అవును ముందు 50 ఇపుడు 150. మొత్తం 200′ అన్నాడు. తిక్క రేగి ‘అదేంటి 150 కొట్టి 200 అంటున్నావ్’ అని కోపానికొచ్చాను. ’200 కొట్టాను..కావలంటే చెక్ చేసుకో’ అని దబాయించాడు.. ఎలా ప్రూవ్ చేయగలను? ఏం చేయాలో అర్ధం కాలేదు..తిట్టేసి బయటకొచ్చేసాను.

కళ్ళముందు ఇలా దోచుకుంటున్నా ఏం చేయలేకపోయానే అని బాధ అనిపించింది. నాలాంటి పరిస్థితి మనలో ఎంతమందికి వచ్చి ఉంటుంది? రోజుకి ఇలా ఎంతమందిని దోచుకుంటారు? 100 కి 99.50 కొట్టేసి…అంతే వస్తుంది అంటె ఎం చేయగలం?

ఒక దారి కావాలి…

అంతర్లాపి

వారాంతం లో మెదడుకి మేత. ఈ క్రింద ఇచ్చిన త్రాసు బొమ్మలో 9 అగ్గి పుల్లలు ఉన్నాయ్. వాటిలో ఏవయిన అయిదింటిని జరిపి త్రాసు రెండు వైపులా సమానంగా చూపేలా చేయగలరా?

సమాధానం సోమవారం…

పనిలోపని శీర్షిక అర్ధం కూడా తెలుసుకోండి.

అంతర్లాపి = ప్రశ్నలోనే సమాధానం ఉండేవి.
ఇక పై ప్రశ్న కు సమాధానం:

డిగ్రీ అయిపోయిన కొత్తలో Railway Recruitment Board (RRB) పరీక్ష రాద్దామని అప్లికేషన్ ఫారం తెచ్చుకున్నా. నింపేద్దామని కవర్ చింపి ఫారం తెరచి చూస్తే దాన్లో ఫార్వర్డ్ క్లాస్ (I really don’t understand in what these people are FORWARD…till now) కి ఉన్న పోస్టుల సంఖ్య ‘ఒకటి’. కోపం, చిరాకుతో వచ్చిన అసహ్యం తో దాన్ని చింపి చెత్తబుట్టలో వేసాను. జాగర్తగా..

భారత దేశం లో ప్రతి విషయం రిజర్వేషన్లతో నిండిపొతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో ఒక పిల్లాడు వేసిన ఈ బొమ్మ చుస్తే అర్ధం అవుతుంది. :-)

reservation

Follow

Get every new post delivered to your Inbox.