జులై 26, 2006...8:39 పూర్వాహ్నం

ఓ చిన్న కథ!

Jump to Comments

గంగా నదీ తీరాన సారంగపురం అనే ఊళ్ళొ రామ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండెవాడు.
ఆ వూరి వెంకటేశ్వరాలయం లొ రామ శాస్త్రి ప్రధాన అర్చకుడు. భగవంతుడంటే అమితమయిన భక్తి.
చిన్నప్పుడు తాతయ్య చెప్పిన “గజేంద్ర మోక్షం” ఆయన లొని భక్తి ని చాల ప్రభావితం చేసింది.

 ఫ్రశాంత వాతావరణం లొ ఉండె ఆ వూరికి ఒక ఉపద్రవం వచ్చింది.

గంగా నది లో వరదలు మొదలయ్యాయి. వూళ్ళొ ఉన్న వాళ్లందరూ పడవలెక్కి వలస వెళ్తున్నారు.
వరద ప్రవాహం ఎక్కువయ్యింది. రామశాస్త్రి  నడుం వరకు నీళ్ళు వచ్చేసాయ్..అప్పుడు ఒక పడవలో
ఆ వూరి మునిసబు వాళ్ళు వెళుతున్నారు. ఆయన రామశాస్త్రి ని చూసి పడవ లోకి పిలిచాడు.
“నేను ఆ వెంకటేశుని నమ్మాను. ఆయనే నన్ను రక్షిస్తాడు” అన్నాడు రామశాస్త్రి.పడవ వెళ్ళిపోయింది
ప్రవాహం పెరిగింది. దగ్గర్లో ఉన్న అరుగు ఎక్కాడు రామశాస్త్రి. అంతలో మళ్ళీ ఒక పడవ..ఈ
సారి వూళ్ళొ వ్యాపారి రంగయ్య, రామశాస్త్రి ని చూసి పడవలోకి పిలిచాడు.
“నేను ఆ వెంకటేశుని నమ్మాను. ఆయనే నన్ను రక్షిస్తాడు” అన్నాడు రామశాస్త్రి.
ఆ పడవ కూడా వెల్లిపోయింది.
ఉధ్రుతి పెరిగింది. ఇళ్ళు మునగడం తో ఇంటి కప్పెక్కి కూర్చున్నాడు రామశాస్త్రి.
ఈ సారి ఆ వూళ్ళొ వుండె వడ్రంగి కిష్టయ్య పడవలొ వెళుతూ”పంతులు..రా పొదాం! మునిగి పొతవ్” అన్నాడు
రామశాస్త్రిలొ అదే నమ్మకం “నేను ఆ వెంకటేశుని నమ్మాను. ఆయనే నన్ను రక్షిస్తాడు”అన్నాడు.
రామశాస్త్రి చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ విష్ణు మూర్తి కనిపించాడు రామశాస్త్రికి.
“హే స్వామి! నిన్ను నేను ఎంతగానొ పూజించానే..
నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వెన్నడూ రాలేదు,అందుకు నాకు బాధ లేదు.
కాని నేను నీమీద పెట్టుకున్న నమ్మకాన్ని అలా వమ్ము చేయడం న్యాయమేనా..స్వామి?
‘నీవె తప్పనితఃపరం బెరుగ ‘ అనగానె సిరికైనా చెప్పకుండా
గజేంద్రున్ని రక్షించడానికి వచ్చిన మాట అబద్ధమేనా?”-అన్నాడు రామశాస్త్రి.
స్వామి ముఖం లో చిన్న చిరునవ్వు…”రామశాస్త్రి..నువ్వు నా ప్రియ భక్తుడివయ్యా..ఆ ప్రేమ తొనే కదా మూడు పడవలు పంపించాను, నువ్వే ఎక్కలేదు.”

ప్రపంచం ఓడిన వాన్నైనా క్షమిస్తుంది..కాని…వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేని వాన్ని
మాత్రం క్షమించదు
.

1 వ్యాఖ్య


ప్రత్యుత్తరమిమ్ము