సెప్టెంబరు 20, 2006

మధుర కావ్యం…

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మధుర కావ్యం… సున్నితమౌ పువ్వుల మనసుల చదివగలిగిన ఆ మహానుభావుడి మనసు, మా తాతగారు అంతే అందంగా, తనదైన శైలి లో ఆలపించినవేళ నా ఆనందానికి హద్దులుండవు… నాకు చాలా ఇష్టమైన ఆ “పుష్పవిలాప కావ్యం”…మనకోసం మరొక్కసారి…
నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము దీతువా?” యనుచు బావురు మన్నవి, కృంగిపోతి, నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై!
ఆయువుగల్గు నాల్గు ఘడియల్ కని [...]