విశ్వంభరీం విశాలాక్షీం వర్గల్ గిరి నివాసినీం
విద్యా సరస్వతీం వందే వీణా పుస్తక ధారిణీం||
అన్ని విద్యలెకెల్ల ఆది దైవం అయిన విద్యా సరస్వతీ ఆలయలు రాష్త్రం లో తక్కువగా ఉన్నాయనే చెప్పాలి.ఉన్న దేవాలయాలలో కూడ, మనకి తెల్సినవి కొన్నే. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కి 50 కి.మీ.ల దూరంలో, శామీర్ పేట,ప్రఙాపూర్ దారిలో ఉన్న వర్గల్ శ్రీ విద్యా సరస్వతీ శనైశ్చరాలయం అందులో ఒకటి. శంభుగిరి అనే కొండ పై నిలిచిన వాగ్దేవి ని చూడడానికి రెండు కళ్ళు చాలవు.దేవీ నవరాత్రుల సంధర్భంగా అక్కడ ఈ తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఈ శనివారం 29వ తేదీన మూలా నక్షత్రం ఉంది. అది సరస్వతీ మాత జన్మ నక్షత్రం.ఆ రోజు అమ్మవారికి లక్షపుష్పార్చన, ఛప్పన్ భోగ్(56 రకాల పిండి వంటలతో నైవెద్యం) మొదలైనపూజలు కన్నుల పండుగగా జరుగుతాయి. నిన్నటి ఆదివారం నేను మరికొంతమందితో కలిసి పాదయాత్ర చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఆ కొండలు, పరిసరాలు, పొలాలు…చాలసేపు మమ్మల్ని మేము మరచిపొయాం. విజయ దశమి నాడు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ ఆనందం అనుభవించాల్సిందే…చెప్పనలవి కాదు.








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)
