ఎప్పుడూ వేడి వేడి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపొయినట్టుంది…దాన్ని కాస్త దారి మళ్ళిద్దామా?
సరదాగా మీకో చిక్కు ప్రశ్న వేయనా? చాలా పాత ప్రశ్నే అనుకోండి… చుద్దాం ఎవరు చెప్పగలరో…
![]()
మరణ శిక్ష పడిన ఒక ఖైది కి రాజు చివరిగా ఒక అవకాశం ఇచ్చాడు. ఆతను దాన్ని ఉపయోగించుకోగలిగితే బ్రతికిపొయినట్టే…
అసలు పరీక్ష ఏంటంటే… అతనికి రెండు ద్వారాలు చూపిస్తారు.వాటిలో ఒకటి బైటకి దారితీస్తే, ఇంకొకటి పులుల బోనులోకి తీసుకెళ్తుంది. రెండు ద్వారాల దగ్గరా ఒక్కో సైనికుడు నిల్చొని ఉంటాడు. వారిలో ఒకడు ఎప్పుడూ నిజమే చెబుతాడు, మరొకడు ఎప్పుడూ అబద్ధమే చెబుతాడు. ఈ ఖైది వారిలో ఒక సైనికుణ్ణి ఒకే ఒక ప్రశ్న అడగి ఏదో ఒక ద్వారం లోపలికి వెళ్ళాలి.అదే వాడికి చావుకో, బ్రతుక్కో దారి చూపిస్తుందన్నమాట.
ఇప్పుడు చెప్పండి ఆ ఖైది ఎవరిని ఏ ప్రశ్న అడిగి తప్పించుకోగలడు?
నేనెలాగు సమాధానం రాస్తాననుకోండి… కానీ చూద్దాం ఎవరు ఎలా ఆలోచిస్తారో…








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)

అభిప్రాయములు
3:36 అపరాహ్నం వద్ద అక్టోబర్ 5, 2006
ఏ సైనికున్నైనా “ఇది ద్వారము బయటికి దారి తీస్తుందా?” అని అడిగితే సరిపోతుంది కదా? నిజమే చెప్పేవాడు “అవును” అంటే వెళ్ళొచ్చు, అబద్దమే చెప్పేవాడు “వెళ్ళదు” అంటే వెళ్ళొచ్చు. ఇందులో కష్టమేముంది??
–ప్రసాద్
http://charasala.com/blog/
3:36 అపరాహ్నం వద్ద అక్టోబర్ 5, 2006
ఏ సైనికున్నైనా “ఈ ద్వారము బయటికి దారి తీస్తుందా?” అని అడిగితే సరిపోతుంది కదా? నిజమే చెప్పేవాడు “అవును” అంటే వెళ్ళొచ్చు, అబద్దమే చెప్పేవాడు “వెళ్ళదు” అంటే వెళ్ళొచ్చు. ఇందులో కష్టమేముంది??
–ప్రసాద్
http://charasala.com/blog/
5:09 అపరాహ్నం వద్ద అక్టోబర్ 5, 2006
వెన్నెల గారూ,
బుర్ర వేడెక్కిపోతోందంటూనే మళ్లీ వేడెక్కించారు! ప్రసాద్ గారూ…మీరన్నట్టు అడగొచ్చు కానీ ఏ సైనికుడు నిజం చెప్తున్నాడో, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలిసేదెలా?
నేను అనుకోవడం ఒక సైనికుడితో “ఈ ద్వారం గూండా వెలుతున్నాను నాకు తోడుగా వస్తావా?” అనే ప్రశ్న వేస్తే అక్కడ నిజం/అబద్దం అనే ప్రశ్నే ఉత్పన్నమవదు. కాబట్టి ఆ సైనికుడు వస్తానంటే నిరభ్యంతరంగా ఆ ద్వారం నుంచి వేళ్లవచ్చు, రానంటే మరో ద్వారం వెతుక్కోవడమే…ఏమంటారు?
4:12 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 6, 2006
హయ్యో!!! చరసాల గారు ప్రశ్న ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు…ఒకే ఒక సైనికుణ్ణి అదీ ఒకే ఒక ప్రశ్న అడగాలి.ఎవరు నిజం చెబుతారో, ఎవరు అబద్దం చెబుతారో ఆ ఖైదీ కి తెలీదు కదా…
4:17 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 6, 2006
Ismail గారు చాల సమయస్ఫూర్తి తో సమధానమిచ్చారు కానీ, సైనికునికి ఖైదీ తో రావలసిన అవసరం ఎందుకుంటుందండీ? “నేనురాను” అంటే ఉన్న అవకాశం కూడా పోతుందేమో? ఏమంటారు?
7:07 అపరాహ్నం వద్ద అక్టోబర్ 13, 2006
మొద్దు బుర్ర. అంత అమాయకంగా వుండదని తెలుసు,..ఏ ప్రశ్న అయ్యుంటదబ్బా!!!
–ప్రసాద్
http://charasala.com/blog/
11:13 అపరాహ్నం వద్ద నవంబరు 6, 2006
inkaa emtakaalam samaadhaanam ceppandi vennela garu.
5:11 పూర్వాహ్నం వద్ద జనవరి 16, 2007
సమధానం ఆలస్యం గా రాస్తున్నందుకు క్షమించాలి…
ఇద్దరు సైనికులని A,B అనుకుందాం. ఈ ఖైది వెళ్ళి A ని ఇలా ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు.
“నేను ఇపుడు B ని “ఈ B ద్వారం ఎక్కడికి వెళుతుంది” అంటే ఏమని సమాధానం చెబుతాడు?”
అతడు A అని చెబుతాడు అంటే B నుండి వెళ్ళి పోవచ్చు. అతడు B అంటే A నుండి వెళ్ళి పొవచ్చు.
ఎందుకంటే ఈ ప్రశ్న లోనె 2 ప్రశ్న లు ఉన్నాయ్. ఇద్దరు సైనికులు ఉన్నరు. చివరి సమాధానం మాత్రం “వెళ్ళకూడని ద్వారమే” వస్తుంది ఎందుకంటే వారిలో ఒకడు ఎప్పుడూ నిజమే చెబుతాడు, మరొకడు ఎప్పుడూ అబద్దమే చెబుతాడు.