ఒక IIM లో ప్రొఫెసర్ Marketing Concepts గురించి ఎలా వివరించాడో చూడండి…
1. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, “నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగితే అది – “Direct Marketing”
2. మీరు మీ స్నేహితులతో పార్టీ లో ఉన్నారు. మీకొక అందమైన అమ్మాయి తారసపడింది. మీ స్నేహితుడొకడు ఆమె దగ్గరకు వెళ్ళి మీకేసి చూపిస్తూ , “ఆయన చాల ధనవంతుడు. ఆయన్ని పెళ్ళి చేసుకోండి” అంటే అది -”Advertising”
3. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు ఆమె దగ్గరికెళ్ళి కాస్సేపు మాట్లాడి, ఆమె నంబర్ తీసుకున్నారు. మరునాడు ఆమెకి కాల్ చేసి “నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడుగుతారు. అది – “Telemarketing”
4. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. ఆమె ని చూడగానే మీరు మీ టై సరిచేసుకొని, ఆమె దిగుతున్న కార్ డోర్ తెరిచి, లగేజ్ చేతిలోకి తీసుకొని, ఆమెని లోనికి తీసుకెళ్ళి, చేతికి ఒక డ్రింక్ అందించి, “మీకు తెలుసో లేదో..నేనొక ధనవంతున్ని.నన్ను పెళ్ళి చేసుకోండి” అంటారు. అది -”Public Relations”
5. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. ఆ అమ్మాయె మీ దగ్గరకు వచ్చి “మీరు చాల ధనవంతులని వన్నాను. నన్ను పెళ్ళి చేసుకుంటారా?” అని అడిగుతుంది. అది “Brand Recognition”
6. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, “నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగారు. ఆమె మీ చెంప ఛెళ్ళుమనిపించింది. అది -”Customer Feedback”
7. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, ” నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగారు. ఆమె తన భర్తని మీకు పరిచయం చేసింది. అది -”Demand and Supply gap”
8. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళేలోగా మరొకడు వెళ్ళి ఆమె తో ” నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగాడు. ఆమె అతనితో వెళ్ళిపొయింది. అది -”Competition eating into your market share”
9. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి ” నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగేలోగా మీ భార్య వెంకనుండి వచ్చి మొట్టికాయ వేసింది. అది -”Restriction for entering new markets”








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)

అభిప్రాయములు
6:14 అపరాహ్నం వద్ద మార్చి 21, 2007
Too Good
8:32 అపరాహ్నం వద్ద మార్చి 21, 2007
చాలా బాగా చెప్పాడు కదా.
9:21 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 25, 2007
మీ టపా చాలా నవ్వించింది.
12:47 అపరాహ్నం వద్ద అక్టోబర్ 25, 2007
10. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి ” నేను చాల ధనవంతుణ్ణి. మిమ్మల్ని విమానాల్లో ఫస్టుక్లాసులో తిప్పగలను. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడగ్గానే “సొంత జెట్టు కలవాడి కోసం చూస్తున్నాను” అని సమాధానమిస్తే అది “entry barrier”
11:00 పూర్వాహ్నం వద్ద నవంబరు 8, 2007
… కాదండి…అది choosing wrong market