(కొంచెం ఆలస్యంగా పోస్ట్ చేస్తున్నానేమొ…)
ఈ నెల ఈ-తెలుగు సమావేశానికి నేను కూడ వెళ్ళానోచ్. పెళ్ళిలో బంధువులను కలుసుకున్నంత ఆనందమేసింది. వీవెన్, రావు గారు, కిరణ్, సుధాకర్, పద్మనాభం గారు, శ్రీధర్, త్రివిక్రం, తాబాసు గారు, కశ్యప్…ఇలాంటి పెద్ద పెద్ద బ్లాగరులని అందరిని కలిసే సరికి చాల సంతోషంగ ఉండింది. జ్యోతి గారిని కొన్ని సార్లు (కొన్ని కంటే కొంచెం ఎక్కువ సార్లు) గుర్తు చేసుకోడం జరిగింది. అక్క వస్తాను అని రాలేదుగా మరి… తాబాసు గారు చెబుతూ ఉంటే అలా వింటూ కూర్చున్నాం చాలా సేపు. ఆది తెలుగు బ్లాగరి కొంచెం ఆలస్యంగా వచ్చరు. (అదే..లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చాడన్నమాట
). కొత్త పెళ్ళికొడుకు కశ్యపుడి పెళ్ళి పత్రికలు పంచాక ఉద్యానవనం నుంచి బాహ్య ప్రపంచం లోకి అడుగెట్టాం. మొత్తమ్మీద బాగా అనిపించింది.
ఇంతకీ ఈ సమావేశం వివరాలు ఎక్కడైన పోస్ట్ చెసారా? కూడలి కనపడలేదు. (లేక నాకే కనబడలేదా?)








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)
