పొద్దున్నే కాఫీ చేతికిస్తూ భర్త తో అంది భార్య వయ్యరంగా.
“ఏవండీ..నాకు రాత్రి ఒక కల వచ్చింది. మీరు నాకు రవ్వల నెక్లెస్ కొనిచ్చినట్టు. దానర్ధం ఎంటడి?”
“ఆహ..సాయంత్రం దాక వెయిట్ చెయ్యి. నీకె తెలుస్తుంది”
ఆనందం తో మాట రాలేదు ఆమెకి. ఆపూట ఇళ్ళంతా నీట్ గా సర్దేసింది. సాయంత్రానికి తను కూడా రెడీ అయిపోయి భర్త కోసం గుమ్మం దగ్గర నిలబడి చూస్తోంది.
ఆయన రాగానే చేతిలోంచి బ్యాగ్ లాక్కెళ్ళి లోపల పెట్టి వేడి వేడి గా కఫీ తీసుకొచ్చి చేతిలో పెట్టింది.
చిరు మంద హాసం తో తను కూడా ఒక గిఫ్ట్ ప్యాక్ తీసి చేతికిచ్చాడు భర్త. ఛక చక దాన్ని తెరచి చూసింది ఆమె మెరిసే కళ్ళతో.
అందులో “కలలు-వాటి అర్ధాలు” అనే పుస్తకముంది
దీపావళి శుభాకాంక్షలు
నవంబరు 8, 2007...11:38 పూర్వాహ్నం
కల
Jump to Comments








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)

అభిప్రాయములు
2:09 అపరాహ్నం వద్ద నవంబరు 8, 2007
baagumdi.
3:58 అపరాహ్నం వద్ద నవంబరు 8, 2007
cAla baagumdi.