వెన్నెల ని తాకి చాలా కాలం అయింది
ఇంతకాలానికి మళ్ళీ పున్నమి నాడు కాస్త సమయం చిక్కింది.
మొన్న ఎదో పుస్తకం తిరగేస్తుంటే ఒక పద్యం కనిపించింది. అష్ట దిగ్గజాలలో ఒకడైన అల్లసాని పెద్దన గారిదనుకుంట!
కలనాఁటి ధనములక్కఁర
గలనాటికి దాచఁమలగర్భుని వశమా?
నెలనడిమినాఁటి వెన్నెల
యలవడునే గాదెఁబొయ నమవసనికిన్!
ఈ పద్యం పెద్దన చెప్పాక, అమావాస్యను అమవస చేసాడని వికటకవి వెటకారంగా ఎదో పద్యం చెప్పాడని అంటారు. అదేంటో మీకు తెలుసా?








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)

అభిప్రాయములు
11:02 అపరాహ్నం వద్ద జూన్ 18, 2008
ఎమి తిని సెపితివి కవితను
అమవసనిస యన్నమాట అలసనిపెదనా
-ఇంతవరకే గుర్తుకొచ్చింది.
1:36 పూర్వాహ్నం వద్ద జూన్ 19, 2008
ఈ పద్యంలొ నాకు గుర్తున్న మరికొన్ని పదాలు. దోషాలుండవచ్చు.
ఏమితిని సెపితివి కపితము
బ్రమపడి ఉమెత తిని సెపితివా
ఎరిపుచకాయ తిని సెపితివా
అమవస నిసన్న మాట అలసనిపెదనా
బొల్లోజు బాబా
4:09 పూర్వాహ్నం వద్ద జూన్ 19, 2008
http://vaagvilaasamu.blogspot.com/2007/05/blog-post_05.html
3:59 అపరాహ్నం వద్ద ఆగష్టు 5, 2008
Dear telugu blogger,
We are looking for telugu bloggers.
Please signup at http://www.enewss.com and submit your telugu blog.
Thanks
sri