వర్షం లో తడిచి ఇంటికొచ్చానొక రోజు.
నన్ను చూడగానే అన్నయ్య ‘ఏరా! ఆ గొడుగు తీసుకెళ్ళొచ్చు కదా?’ అన్నాడు.
అక్కేమో ‘వర్షం తగ్గే వరకు ఆగొచ్చు కదా. తడిచొచ్చావేంటి?’ అంది.
నాన్న ‘నీకు జలుబు చేసి జ్వరం వస్తే గాని బుద్ధి రాదు ‘ అన్నాడు.
మా అమ్మని చూద్దును కదా…
నా తలని తన చీర కొంగుతో తుడుస్తు గట్టిగా తిడుతోంది.
నన్ను కాదు…
…
…
…
…
…
వానని.
(ఒక ఆంగ్ల వేగు అనువాదం)









![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)

అభిప్రాయములు
1:28 పూర్వాహ్నం వద్ద మార్చి 7, 2009
బాగు బాగు! భెస్షుగ్గా ఉంది.
12:53 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 23, 2009
బాగుంది.
2:21 పూర్వాహ్నం వద్ద జూన్ 11, 2009
అదే కామొసు అమ్మ ప్రేమంటె