మే 29, 2009...2:27 అపరాహ్నం

స్పర్శించిన స్నేహం

Jump to Comments

arjun and pargat 

…స్నేహమనే అందమైన భావనకు అంకితం…

అది 1975 వ సంవత్సరం.

అర్జున్ సింగ్, పర్గత్ సింగ్లు ఇద్దరు ప్రాణ మిత్రులు. పాఠశాల మొత్తం వారి స్నేహం గురించే తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, స్కూల్లో టీచర్లు అందరూ వాళ్ళ స్నేహాణ్ణి మెచ్చుకునేవారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కలిసే ఉండేవాళ్ళు. కలిసే తిరెగేవాళ్ళు, స్కూల్ లో కూడా కలిసే  కూర్చునేవాళ్ళు. ఇద్దరూ పెద్దయ్యాక పేద్ద పోలీసు ఆఫీసర్లు కావాలని, ఈ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.

 

ఒక దురదృష్టకరమైన రోజు… విధి వాళ్ళను విడదీసింది, అర్జున్ వాళ్ళ నాన్న కి వచ్చిన ట్రాన్స్ ఫర్ రూపంలో.

ఆ రోజు స్కూల్ లొ కలిసే చదువుకునే చివరి రోజు. స్కూల్ నుంచి బయటకి నడుస్తూ ఇద్దరూ ఇలా మాట్లాడుకున్నారు.

అర్జున్: మనం విడిపొతున్నాం పర్గత్. ఇవాళ చివరి రోజు.నాకు చాలా బాధగా ఉంది.
పర్గత్: నాకు కూడా చాల బాధగా ఉంది అర్జున్. మనం కచ్చితంగా ప్రతి సంవత్సరం కలవాలి.
అర్జున్: తప్పకుండా. నువ్ ఉత్తరాలు రాస్తూ ఉండు.
పర్గత్: ఓకే అర్జున్.

ఆ తరువాత కళ్ళనీళ్ళతో వాళ్ళు విడిపొయారు.

*********
కాలం గడుస్తోంది. వాళ్ళ ప్రమాణాన్ని రెండు సంవత్సరాలు నిలుపుకున్నారు. కాని ఆ తరువాత ఎవరి జీవితం లో వాళ్ళు బిజీ అయిపోయారు. అర్జున్ కి తన స్నేహితుని తో మాట్లడే అవకాశమే రాలేదు.

కాలం గడుస్తోనే ఉంది. ఇద్దరూ వాళ్ళు అనుకున్నట్టే పేద్ద పోలిసులయ్యారు.

*********
అది 2009…
జలంధర్ పోలీస్ స్టేషన్.

lil-red

ట్రింగ్… ట్రింగ్…

అర్జున్ ఫోను చేతిలోకి తీసుకున్నాడు.
“హెలో”
“Is this Arjun?”
“yes”
” హే అర్జున్…నేను పర్గత్ సింగ్. నువ్ ఈ పొలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నావని తెలిసి కాల్ చేసా”
“అర్జున్ మొహం విప్పారింది “పర్గత్..ఎలా ఉన్నావ్? ఎక్కడున్నవిపుడు?”
“మీ స్టేషన్ ముందు”
అర్జున్ ఆనందం తట్టుకోలేక పోయాడు. “వస్తున్నా”. ఫోను పెట్టేసి పరిగెత్తుకుంటు బైటకి వెళ్ళాడు.

ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు.
ముప్పయ్యేళ్ళ తరువాత కలిసిన స్నేహితుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకోవాలనుకున్నాడు.

It was a very touching moment for both of them…

కాని…కౌగిలించుకోలేదు.

ఏ…?

 

 

ఎందుకు…?

 

 

 untitled2

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 Me on Moon

 

 

 vennela

అభిప్రాయములు


ప్రత్యుత్తరమిమ్ము