జూన్ 17, 2009...1:15 అపరాహ్నం

భయం

Jump to Comments

నేను ఒంటరిగా ఉండడానికి భయపడ్డాను…
…నన్ను నేను ఇష్టపడడం నేర్చుకునేంత వరకు!

నేను ఓటమి అంటే భయపడ్డాను…
…ప్రయత్నించడం మానడమే ఓటమి అని తెలిసేవరకు!

నేను గెలుపంటే భయపడ్డాను…
…నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడమే గెలుపని తెలిసేవరకు!

నేను జనాల అభిప్రాయాలంటే భయపడ్డాను…
…ఎవరికయినా, దేనిగురించయినా, ఎలాంటి అభిప్రాయాలయినా ఉండొచ్చని తెలిసేవరకు!

నేను తిరస్కరించబడడాన్ని భయపడ్డాను
…నన్ను నేను స్వీకరించేవరకు!

నేను నొప్పి అంటే భయపడ్డాను…
…విజేతగా మారడానికి అదే కారణం అని తెలిసే వరకు!

నేను నిజం అంటే భయపడ్డాను…
…అబద్ధం ఎంత అసహ్యంగా ఉంటుందో తెలిసే వరకు!

నేను జీవితం అంటే భయపడ్డాను…
…దాని పరిమళాణ్ణి ఆస్వాదించడం మొదలు పెట్టేవరకు!

నేను మరణం అంటే భయపడ్డాను…
…అది చివర కాదు, మరొక మొదలు అని తెలిసే వరకు!

నేను నా తలరాత అంటే భయపడ్డాను…
…నేనే దాన్ని మార్చగలనని తెలిసే వరకు!

నేను ద్వేషం అంటే భయపడ్డాను…
…ద్వేషించే వాళ్ళని ప్రేమించడం లొ ఉన్న ఆనందం తెలిసే వరకు!

నేను ప్రేమంటే భయపడ్డాను…
…ప్రేమ అమావాస్య నాడు కూడా నిండు పున్నమి వెన్నెలని చూపించగలదని తెలిసే వరకు!

నేను మార్పు అంటే భయపడ్డాను…
…గొంగళి పురుగే అందమైన సీతాకోకచిలుకలాగా మారగలదని తెలిసే వరకు!
Courage

అభిప్రాయములు


ప్రత్యుత్తరమిమ్ము