జూన్ 29, 2009...12:37 అపరాహ్నం

రిజర్వేషన్

Jump to Comments

డిగ్రీ అయిపోయిన కొత్తలో Railway Recruitment Board (RRB) పరీక్ష రాద్దామని అప్లికేషన్ ఫారం తెచ్చుకున్నా. నింపేద్దామని కవర్ చింపి ఫారం తెరచి చూస్తే దాన్లో ఫార్వర్డ్ క్లాస్ (I really don’t understand in what these people are FORWARD…till now) కి ఉన్న పోస్టుల సంఖ్య ‘ఒకటి’. కోపం, చిరాకుతో వచ్చిన అసహ్యం తో దాన్ని చింపి చెత్తబుట్టలో వేసాను. జాగర్తగా..

భారత దేశం లో ప్రతి విషయం రిజర్వేషన్లతో నిండిపొతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో ఒక పిల్లాడు వేసిన ఈ బొమ్మ చుస్తే అర్ధం అవుతుంది. :-)

reservation

అభిప్రాయములు

  • రిజర్వేషన్ విషయం కాలేజిలో సీట్లప్పుడు, ఉద్యోగాల్లో పోస్టులప్పుడూ మాత్రమే తెలిసొచ్చే అర్బన్ యువత టిపికల్ రెస్పాన్స్ మీ టపా. అర్థం చేసుకోదగ్గ పరిణామమే.

    కాకపోతే ఈ రిజర్వేషన్ వెనుకున్న సామాజిక చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు కార్టూన్ బొమ్మలతో పాటూ కొంత సహానుభూతి వస్తుందేమో!

  • I completely agree with you. My opinion is that reservation system should be based on financial condition and should be coupled with merit. For example:
    If there is congestion between two candidates of same economic situation, then based on the merit the candidate should be picked up between them.

  • @Venkata Ganesh. Veerubhotla: Economic considerations are called scholarships not reservations. They are to compensate the economic backwardness of individuals who can’t access facilities because of their financial conditions.

    The reservations spoken here are to compensate social backwardness. Their existance has history to it. Please try to learn of it.

  • Dear Mahesh,

    I see. I got your point. I agree with it. But for how many years this kind of system need to be there to compensate the history?
    Also, it will be good if you can please brief me about the historic reasons behind it.(Any URL is also useful).

  • రిజర్వేషన్ ల పేరుతో మనం (అంటే సిస్టం లో మనమందరం భాగమే కదా) సమస్య కు అసలు పరిష్కారాన్ని ఇవ్వడంలో విఫలంవుతున్నాం.. “caste should be made irrelevant in the society”.. మరి అది జరుగుతోందా.. లేదు.. కొత్త జనరేషన్ లో అయినా మనుషుల మధ్య కులాల కుమ్ములాటలు లేకుండా చెయ్యగలుగుతున్నామా? లేదు…ఈ మధ్య బ్లాగ్లోకంలో జరిగిన చర్చే ఒక పెద్ద ఉదాహరణ…

    సామాజిక చరిత్ర, నేపధ్యం ఉన్నాయి కాబట్టే ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్ లు మన సిస్టం లో ఉన్నాయి… సరే.. కాదనడం లేదు.. కానీ అసమానతలని రూపు మాపడం పేరుతో వాటిని మనం ఇంకా అదే విధానంలో కొనసాగిస్తున్నాం…. వోట్ బ్యాంకు రాజకీయాలకి కేవలం సమిధలవుతున్నాం… ఇప్పుడు “reverse discrimination” జరుగుతోందనే అభద్రతా భావం తో (సో కాల్డ్) అగ్ర కులాలు ఉంటే, ఇంకోపక్క ఇంకా ఫ్యూడల్ సంస్కృతి కి బలి అవుతున్న నిమ్న కులాలు ఉన్నాయి…. రెండు వైపులా అన్యాయం జరుగుతూనే ఉంది…
    దీనికి ఐడియల్ పరిష్కారం….. కులాన్నిసమాజంలో “irrelevant” చెయ్యాలి…… కుల ప్రాతిపదికన జరిపే ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వం నిషేధించాలి…. కుల సంఘాల కి ప్రభుత్వ గుర్తింపు, మీడియా కవరేజ్ ఉండకూడదు… వ్యక్తీ సామాజిక నేపధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు.. ఇవేవో ఒక రోజులో జరిగేవి కాకపోవచ్చు.. కనీసం ఆ వైపు అడుగులైనా వెయ్యడం మొదలెట్టాలి…

  • enough the reservation system. 60 years on words many to be done for the res people. but now also to be done many more in the mean while middle class sector’s of oc people suffer from reservation system. mahesh garu actualley reservation is needed to only poor persons . in the cover of reservation system economicalley upper persons of res. sector persons are miss used the same. if you have like sympothey on res. are you agree the classification of sc . according to sc res. maximum ratio avialable to only one caste. that you know all the statistics.plese take care of about our miidle class person’s in oc’s.now we are feeling unsecured. businesses becomes very much compitative and corporate intrusions even grocieries.Brahmin culture is gone due to migrations from rural to urban area and job oriened lives took drag changes in their lives. maximum ratio of brahmin now it self faceing problem.kamma,reddy and so on oc caste persons who have eco.sound they are good rest of all in problem. there is no way to spell their problems and nor to bare their problems. mahesh sir plese look into the oc’s problem’s also. cartoon represent the same and reservation activitists raise the res. sector to bee needed in urinals also. ther is many thing happened in past ,now is goes on ,in future to be solved without res. system tobe lived all are happy.

  • కళ్ళ ముందు జరుగుతున్నదానిని గుర్తించడానికి చరిత్ర సమాధులు త్రవ్వటం అవసరమా? కార్టూను ఆలోచింపజేసేదిగా ఉంది.
    చరిత్రలో జరిగన దానికి అప్పటి కారణలు మనకు తెలియవు. ఇప్పుడు వాటి గురించి చేసే వన్నీ ఊహాగానాలే. అప్పటి అగ్రవర్ణాల (సోకాల్డ్) వాళ్ళ వల్ల నిమ్న కులాలకు అన్యాయం జరిగిందని అనుకొంటే, దానికి కారణం అప్పటివారు కాబట్టి వారిని శిక్షించాలి. ఇప్పుడు కులప్రసక్తి లేని ప్రభుత్వం కావాలి. అందరికీ విద్య ఉపాది కలిపించాలి. గతంలో జరిగిన దానికి ప్రతీకారంగా ఇప్పుడు అగ్రకులాలను విమర్శిస్తాము అని, దానికి పరిహరంగా ఇప్పుడు రిజర్వేషన్లు కావాలంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. గజనీ, గోరీ, అల్లాఉద్దీన్ ఖిల్జీ లాంటి మహమదీయులు భారతదేశాన్ని చిన్నాభిన్నం చేశారు. మరి వారికి రిజర్వేషన్లు ఎందుకు. మనము వారిని విమర్శిస్తూ ఆనందపడాలా? ఇంగీషు వారు భరతదేశాన్ని, 300 ఏళ్ళు పరిపాలించి మనలను ఎన్ని కష్టాలకు గురి చేశారో తెలియదా? వాటికి పక్కా చారిత్రపు ఆదారాలు దొరుకుతాయి. దానికి ప్రతీకారంగా ఇంగ్లీషు వారిని తిట్టాలా? వర్తమానాన్ని దిద్దుకోవాలనే ఆలోచన, ఆశయం అవసరం. చరిత్ర అదారలు వెదకడం ప్రస్తుత సమస్యను పరిష్కరించడానికి పనికిరాక పోగా అనవసరపు వైషమ్యాలు పెంచుతున్నాయి.

  • @Venkata Ganesh. Veerubhotla: రిజర్వేషన్ కల్పించడానికి కారణం పేదరికం కాదు. కొన్ని కులాలలో పుట్టినవారిని పరిపాలనా పరిధి (both access to goods and services)కి దూరంగా ఉంచుతూ deprivation కు గురిచేయబడుతున్నారన్న సామాజిక నిజానికి విరుగుడుగా రిజర్వేషన్ అనే వెసులుబాటు కల్పించబడింది.

    “caste should be made irrelevant in the society”.. అనే ఒక ఆదర్శవంతమైన ప్రతిపాదన ఈ ACCESS ను నిజం చెయ్యదుగనక, simultaneously some grants were needed to make it functional. అందుకే constituent assembly లో జరిగిన సుదీర్ఘమైన చర్చల్లో ఈ నిర్ణయం జరిగింది. ఇలా చెయ్యటం ప్రపంచం మొత్తం మీదా ఇదే మొదటిసారి కాబట్టి, పదిసంవత్సరాల తరువాత దీని అమలును సమీక్షించి పున:పరిశీలన చెయ్యాలనే నిర్ణయించడం జరిగింది.

    పదిసంవత్సరాలలో కనీసం ఒక జెనరేషన్ ఈ “లాభం” పొంది “మారుతుంది” అన్న ఆశ అడియాశగానే మిగిలింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్ళయినా universal education పూర్తికాని ఈ దేశంలో, స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా అందరికీ ఉన్నతవిద్య కనీసం అందుబాటులోరాని ఈ దేశంలో, అందరికీ ఉద్యోగాలు ఇప్పటికీ అందని ద్రాక్షే అయిన ఈ resource poor దేశంలో,సమస్య అలాగే ఉంది. మూలాలు అలాగే ఉన్నాయి. రిజర్వేషన్ అమలులోనే ఉంది.

    Denial of access to resources due to అంటరానితనం,కులవివక్ష,discrimination పూర్తిగా పోయిందని గుండెలమీద చెయ్యేసుకుని అందరూ చెప్పిననాడు, ఈ రిజర్వేషన్ అవసరం లేదు. ఐదువేల సంవత్సరాల అణచివేతకు రిజర్వేషన్ ప్రతీకారం కాదు. అందుబాటులో లేని అవకాశాలను అందిపుచ్చుకునే ఒక సాధనం. అంతే!

    జనరేషన్లు మారినా ఆభిజాత్యాలు మారలేదు. అంటరానితనం పైకి కనిపించకపోయినా మానసిక అంటరానితనం వీడలేదు. ఒకప్పుడున్న అసహ్యం ఇప్పుడు కసిగా మారిందేతప్ప కలుపుకుపోదామన్న స్పృహ రాలేదు. మరి పరిస్థితి ఎందులో మారింది?

    మొదటి జెనరేషన్ దళితులు ప్రభుత్వ ఉద్యోగాల్లో చప్రాసీలుగానే మిగిలిపోతే, ఇప్పుడు మరికొందరు దళితులు మధ్యతరగతిలోకి వచ్చిపడ్డారు. ఒక తరం పాఠశాల విద్యకోసం, చిరుద్యోగాల కోసం పోరాడితే ఇప్పుడు ఉన్నతవిద్యకోసం పైఉద్యోగాల కోసం పోరాడుతున్నారు. “సమానత్వం” మాత్రం ఎండమావిగానే మిగిలింది.

    రిజర్వేషన్ అమలులో,ఆచరణలో,లాభం పొందే విధానాలలో అన్ని ప్రభుత్వ పధకాల్లాగానే లోపాలున్నాయి. వాటిని సరిచెయ్యకపోతే ఇదొక చిల్లుపడిన కుండ. ఎన్ని నీళ్ళుపోసినా ఇంకా పోస్తూనే ఉండాలి. అదొ ఒకవైపు నిజమైతే మరో వైపు ఈ సమాజమూ మరొక చిల్లుకుండ. ఏ కులవ్యవస్థ ప్రక్షాళనకైతే నిబద్ధులమన్నామో రాజకీయ-సామాజిక-ఆర్థిక అవసరాలకోసం వాటినే వ్యవస్థీకరించి కూర్చున్నాము. ఇక “సమానత్వం” ఎక్కడ్నుంచీ వస్తుంది? రిజర్వేషన్ ఎందుకని పోతుంది?

    • పై కార్టూను సత్య దూరంగా ఉంది. మీ వ్యాసంలో రిజర్వేశన్ల వల్ల రిజర్వేషన్ లేని వారికి సీట్లు తగ్గుతున్నాయనే అపోహ కలిగించేలా ఉంది. కాని సత్యం వేరేలా ఉంది. BC, SC, ST లు కాక మిగిలిన వారు 20% కూడా లేరు. కానీ 50% సీట్లు ఓపెన్ కోటాలోనే ఉన్నాయి. యాభై శాతానికి మించిన బీసీలు ఐ ఏ ఎస్, ఐ పీ యస్ ఉద్యోగాలలో ఐదు కన్నా తక్కువ శాతం ఉండడానికి కారణమేంటి? మెరిట్ గురించి మాట్లాడకండి. లక్షలు పోసి కోచింగ్ సెంటర్ లలో చేరితే వచ్చేది మెరిట్ కాదు.

      ప్రతి వర్గం తమ జనాభాకు తగిన నిష్పత్తిలో స్వతహాగా సీట్లు పొందగలిగిన రోజున రిజర్వేషన్ల అవసరం ఉండదు.

  • @రమేష్: I can empathize with the feeling of reverse discrimination at individual level. కానీ ఒక social engineering process లో వ్యక్తుల భావాలకన్నా సామాజిక న్యాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆర్థికపరమైన deprivation లో ఉన్న “అగ్ర”(?)కులాలకు స్కాలర్ షిప్పులు లేదా ఇతర సబ్సిడీలి కల్పించడాన్ని నేను పూర్తిగా సమర్ధిస్తాను. It is state’s responsibility. కాకపోతే, రిజర్వేషన్ కు మూలం కులపరమైన denial of access కాబట్టి అందులో భాగం కావాలంటే మాత్రం బహుశా ఈ కులాకు కుదరదు.

    మనదేశంలోని మూల సమస్య వనరులు లేకుండటం. అడిగినవాడికి ఇంజనీరింగులో సీటొచ్చేస్తే ఈ “యూరినల్” ఆలోచన వచ్చేనా? కాబట్టి, ఉన్న కాసిన్ని వనరుల్లో ఈ రేషనింగ్ జరుగుతోంది. అందుకే ఈ distress. అందుకని మూలసమస్య ఇక్కడ రిజర్వేషన్ కాదు. పోరాడాల్సింది రిజర్వేషన్ పొందుతున్నవాడితో కాదు. అందరికీ తగినన్ని వనరులు కల్పించలేని ప్రభుత్వంతో. I think your argument is misguided.

    @పునర్వసు: చరిత్ర తవ్వుతున్నది నేను కాదు. మీరు. నేనన్నది రిజర్వేషన్ చారిత్రక నేపధ్యం, ఆశయం అర్థం చేసుకోమని మాత్రమే. Please read constituent assembly discussion on reservation and subsequent committee reports such as Mandal etc. and human development reports that are published every year.

    మీ వ్యాఖ్యలో దళితులు అగ్రవర్ణాలపై కక్షతీర్చుకోవడానికి రిజర్వేషన్ వ్యవస్థ స్థాపించారనే సూచన కనబడుతోంది. I can understand where this idea comes from. కానీ ఒక పరిణితి చెందిన వ్యక్తిగా మీ అంతట మీరు సరైన మూలాల్ని గ్రహించగలరనే ఆశిస్తాను.

    May be you can start from here… http://books.google.co.in/books?id=6DCegd2xxF8C&pg=PA13&lpg=PA13&dq=constituent+assembly+discussion+on+reservations&source=bl&ots=KOyZTawV9B&sig=eXSCQUjt0WZ9sUlOa_d856iH8f4&hl=en&ei=J0dJSrj0F9aBkQWH_9njBg&sa=X&oi=book_result&ct=result&resnum=7

  • 5000 years of oppression BS
    where did this number come from.
    so the reservations should continue for another 5000 years, great. long live the caste system.
    no matter they become ministers, CMs, scientists, doctors, industrialists, millioneers and billioneers (oh !they are only few..all of them have to become, not even one should be left behind)
    you can not equate today to a day 100 years ago.
    the socio- economic and cultural scenerios.
    society keeps changing it is a dynamic process.
    As long as people are served in a silver platter nobody would want to loose the oppurtunity,. no matter what, thats it.
    no need to feel guilty either
    so called forward caste people did not reach this stage with reservations but by sheer hard work.
    there are millions of them living in utter poverty.
    Just accept the simple fact that the wave is towards us and we are taking advantage of it.
    no need to preach solems everybody read the same history.

  • @రమణ్: ఐదువేల సంవత్సరాలు అన్నది నేనే. కానీ అది “మాది ఐదువేల సంవత్సరాల చరిత్ర” అని గర్వంగా చెప్పుకునే కొందరు మేధావులనుంచీ గ్రహించింది మాత్రమే. ఓ.కే. అది తప్పనుకుందాం ఒక వెయ్యి సంవత్సరాలు. ఒక ఐదువందల సంవత్సరాలు. కనీసం వంద సంవత్సరాలు! అణచివేత జరిగింది. అమానవీయమైన చర్యలు జరిగాయి. అది మీరు కాదన్నా నేను కాదన్నా నిజం.

    “so called forward caste people did not reach this stage with reservations but by sheer hard work.” ఛా! Is it!!! అన్ని సంవత్సరాలూ వేరొకరికి అవకాశం ఇవ్వక అప్రకటిత రిజర్వేషన్లు అనుభవించిన కులాలు లేవా! కులవిభజనతో అసమాన సమాజన్ని పంచుకున్నారా? లేక కొందర్ని అణచి మిగతావాళ్ళు పంచుకున్నారా!

    What makes you think reservations are a free grant? Its a social corrective mechanism. Its an attempt towards social equality. Its a compensation.

    Its actually the time to change the winds and waves too. Because of this reverse trend only such a stirrup effect is visible. That’s precisely the reason why your rhetoric is sounding shrill and claims are shallow tall.

  • హరి దోర్నాల has rightly pointed out where the problem lies. i agree with him.

    reservations are needed at present.

    reservations may be denied for those who try to enjoy for more than two generations.

    those who benefited likewise, through reservations above the cadre of group II may be brought under creamy layer.
    it will widen the benefits to the needy.

    finally the cartoon is utterly nonsence and misguiding.

    1.in the sc category 16% share is given to them, for sts 7%, for bcs 27% where as the open category contains 50%. in the drawing the proportionate toilets are not drawn. that is why it is misleading.

    2. for BCs though 27 percent is given, in the entire population they constitute nearly 60%.
    so how much their share should have been pl. imagine.

    3. likewise the forward communities constitute around 20% of total population, imagine how much share they are eligible for and how much they are getting actually (50%). but in the cartoon only one toilet is drawn to tamper the facts and inject poison into the minds of the younger generation. isnt it?

    pl. talk subjectively. not personally. i am tired of all such stuff.

    bollojubaba

  • i am sorry.

    the second point in my above comment is wrongly expressed.
    my view is the limiting the reserved candidates to 50% of the total seats is unjust, so they should be allowed to compete for the remaining seats to too.

    i am sorry once again


ప్రత్యుత్తరమిమ్ము