ఎండా కాలం మొదలయింది కదా…వర్షం పడుతోంది బయట. ఇప్పుడు మీకో జోకు
ఒక ప్రఖ్యాత మానసిక వైద్యుణ్ణి మా ఆఫీసు లో ఉపన్యాసానికి పిలిచారు. కొంతసేపు అనుభందాల గురించి మాట్లాడిన ఆయన “నేను నా జీవితం లోని మధుర క్షణాలన్నీ ఒక స్త్రీ కౌగిట్లో గడిపాను. కాని ఆమె నా భార్య కాదు” అని ఆపాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం!!
“ఆమె నా తల్లి” అన్నాడు రెండు క్షణాల తరువాత. అంతే ఆ గది అంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
ఒక వారం తరువాత మా మానేజర్ ఇంట్లో చిన్న పార్టీ. ఒక రెండూ పెగ్గులు పడ్డాక ఆయనకి మానసిక వైద్యుడి జోకు గుర్తొచ్చింది. వెంటనే ”నేను నా జీవితం లోని మధుర క్షణాలన్నీ ఒక స్త్రీ కౌగిట్లో గడిపాను. కాని ఆమె నా భార్య కాదు” అని ఆపాడు. వాళ్ళావిడ మొహం లో అప్పటిదాకా ఉన్న చిరునవ్వు పోయి కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఒక ౨౦ సెకన్ల తరువాత అందరి మొహాల్ని దొంగలా చూసి “….ఆమె ఎవరో నాకు గుర్తురావట్లేదు” అన్నాడు జోకు తరువాయి భాగం గుర్తు రాక!
Moral of the story: Don’t copy if you can’t paste .!









![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)
