డిగ్రీ అయిపోయిన కొత్తలో Railway Recruitment Board (RRB) పరీక్ష రాద్దామని అప్లికేషన్ ఫారం తెచ్చుకున్నా. నింపేద్దామని కవర్ చింపి ఫారం తెరచి చూస్తే దాన్లో ఫార్వర్డ్ క్లాస్ (I really don’t understand in what these people are FORWARD…till now) కి ఉన్న పోస్టుల సంఖ్య ‘ఒకటి’. కోపం, చిరాకుతో వచ్చిన అసహ్యం తో దాన్ని చింపి చెత్తబుట్టలో వేసాను. జాగర్తగా..
భారత దేశం లో ప్రతి విషయం రిజర్వేషన్లతో నిండిపొతే ఎలా ఉంటుంది? [...]
Entries Tagged as ‘Uncategorized’
జూన్ 29, 2009
రిజర్వేషన్
జూన్ 17, 2009
భయం
నేను ఒంటరిగా ఉండడానికి భయపడ్డాను…
…నన్ను నేను ఇష్టపడడం నేర్చుకునేంత వరకు!
నేను ఓటమి అంటే భయపడ్డాను…
…ప్రయత్నించడం మానడమే ఓటమి అని తెలిసేవరకు!
నేను గెలుపంటే భయపడ్డాను…
…నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడమే గెలుపని తెలిసేవరకు!
నేను జనాల అభిప్రాయాలంటే భయపడ్డాను…
…ఎవరికయినా, దేనిగురించయినా, ఎలాంటి అభిప్రాయాలయినా ఉండొచ్చని తెలిసేవరకు!
నేను తిరస్కరించబడడాన్ని భయపడ్డాను
…నన్ను నేను స్వీకరించేవరకు!
నేను నొప్పి అంటే భయపడ్డాను…
…విజేతగా మారడానికి అదే కారణం అని తెలిసే వరకు!
నేను నిజం అంటే భయపడ్డాను…
…అబద్ధం ఎంత అసహ్యంగా ఉంటుందో తెలిసే వరకు!
నేను జీవితం అంటే భయపడ్డాను…
…దాని పరిమళాణ్ణి [...]
మే 29, 2009
స్పర్శించిన స్నేహం
…స్నేహమనే అందమైన భావనకు అంకితం…
అది 1975 వ సంవత్సరం.
అర్జున్ సింగ్, పర్గత్ సింగ్లు ఇద్దరు ప్రాణ మిత్రులు. పాఠశాల మొత్తం వారి స్నేహం గురించే తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, స్కూల్లో టీచర్లు అందరూ వాళ్ళ స్నేహాణ్ణి మెచ్చుకునేవారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కలిసే ఉండేవాళ్ళు. కలిసే తిరెగేవాళ్ళు, స్కూల్ లో కూడా కలిసే కూర్చునేవాళ్ళు. ఇద్దరూ పెద్దయ్యాక పేద్ద పోలీసు ఆఫీసర్లు కావాలని, ఈ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఒక దురదృష్టకరమైన రోజు… విధి వాళ్ళను [...]
మార్చి 6, 2009
అమ్మ
వర్షం లో తడిచి ఇంటికొచ్చానొక రోజు.
నన్ను చూడగానే అన్నయ్య ‘ఏరా! ఆ గొడుగు తీసుకెళ్ళొచ్చు కదా?’ అన్నాడు.
అక్కేమో ‘వర్షం తగ్గే వరకు ఆగొచ్చు కదా. తడిచొచ్చావేంటి?’ అంది.
నాన్న ‘నీకు జలుబు చేసి జ్వరం వస్తే గాని బుద్ధి రాదు ‘ అన్నాడు.
మా అమ్మని చూద్దును కదా…
నా తలని తన చీర కొంగుతో తుడుస్తు గట్టిగా తిడుతోంది.
నన్ను కాదు…
…
…
…
…
…
వానని.
(ఒక ఆంగ్ల వేగు అనువాదం)
డిసెంబరు 12, 2008
వైకుంఠపాళి
రాబోయే ఆర్. నారాయణ మూర్తి సినిమా “వైకుంఠపాళి” లోని పాట. ఇందులో నారాయణ మూర్తి గారు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
ఆర్ధిక సంక్షోభం వల్ల ఉద్యోగం పోగొట్టుకొని..ఇలా…
ఏమున్నదక్కో ఓ ఏమున్నదక్కా…
పొట్ట పెరిగిపొయి..జుట్టు రాలిపొయి…వున్న పరువు పొయి..
ఈ ఇండస్ట్రీ లొ నాకింక
ఏమున్నదక్కో.. ఏమున్నది అక్కొ ఏమున్నది అక్క..
B.Tech చేసినాకా (సామి)
హైదరాబాద్ చేరుకున్నా(సామి)
ఎక్స్ పీరియన్స్ అడుగుతుంటే ఆ ఆఅ ఆఅవ్
ఎక్స్ పీరియన్స్ అడుగుతుంటే, ఎంత కావాలి అంటే అంత పెట్టి, జాబ్ కొట్టినా, జాయిన్ అయ్యినా బాంచన్…
(ఏమున్నదక్కో ఓ [...]
డిసెంబరు 9, 2008
చిన్న విన్నపం
స్నేహితులారా! మొన్నటి 26/11 దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం మనవంతు సహాయంగా ఒక 3 రూపాయలు అందిద్దాం. మన దూరవాణిలో SALAAM అని రాసి ఆ SMS 56388 కి పంపితే NDTV వాళ్ళు దీనిని వాళ్ళకు చేరవేస్తారని తెలిసింది. మనం చేయగలిగిన సహాయమిది!!!
జూన్ 24, 2008
Complicated English
Read the paragraph below…
and try to understand the meaning.
Then look for the answer below. Test yourself first.
‘Two individuals proceeded towards the apex of a natural geologic
protuberance, the purpose of their expedition being the procurement
of a sample of fluid hydride of oxygen in a large vessel, the exact
size of which was unspecified.
‘One [...]
జూన్ 18, 2008
వెన్నెల లో ఒక పద్యం!
వెన్నెల ని తాకి చాలా కాలం అయింది
ఇంతకాలానికి మళ్ళీ పున్నమి నాడు కాస్త సమయం చిక్కింది.
మొన్న ఎదో పుస్తకం తిరగేస్తుంటే ఒక పద్యం కనిపించింది. అష్ట దిగ్గజాలలో ఒకడైన అల్లసాని పెద్దన గారిదనుకుంట!
కలనాఁటి ధనములక్కఁర
గలనాటికి దాచఁమలగర్భుని వశమా?
నెలనడిమినాఁటి వెన్నెల
యలవడునే గాదెఁబొయ నమవసనికిన్!
ఈ పద్యం పెద్దన చెప్పాక, అమావాస్యను అమవస చేసాడని వికటకవి వెటకారంగా ఎదో పద్యం చెప్పాడని అంటారు. అదేంటో మీకు తెలుసా?








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)
