మార్చి 21, 2008

పెద్దలకో చిన్న కధ…

సురేష్ అప్పుడే ఆఫీసునుంచి ఇంటికొచ్చాడు. ఆఫీసులో రోజంతా పనిచేసి చాల చిరాగ్గా ఉన్న సురేష్ ని చూసిడాడీఅనుకుంటూ దగ్గరికొద్దామనుకున్న ఆరేళ్ళ పండు అలాగే దూరంగా కాసేపు నిలబడి వచ్చి పక్కన కూర్చున్నాడు. డాడీ! నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా?”
హా, ఏంటి?”
డాడీ, నువు గంట కి ఎంత సంపాదిస్తావ్?”
కాస్త విసుగ్గ మొహం పెట్టినేకెందుకవన్నీ?” వేళ్ళతో నుదుటిపై రాసుకుంటూ అన్నాడు సురేష్.
లేదు డాడీ, చెప్పవా ప్లీజ్?”
ఏం చెప్పాలిరా, సరేగంట కి 100 రూపాయలు సంపాదిస్తాను.”
ఓహో!” అన్నాడు పండు తల దించుకొని.
డాడీ, నాకు ఒక ముప్పయ్ రూపాయలు ఇవ్వవా?”
అప్పటి వరకు ఉన్న చిరాకు కోపంగా మారింది.
ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? నీక్కావలిసిన బోడి బొమ్మలు కొనుక్కోవడానికి ఇప్పుడు నేను డబ్బులివ్వాలా? ఫొ లోపలికిపోయి నోరుమూసుకొని పడుకో
పండు మొహం చిన్నగా అయిపొయింది. తల దించుకొని లొపలికెళ్ళి తలుపేసుకున్నాడు.
సురేష్ కి మాత్రం ఇంకా కోపం తగ్గలేదు. సోఫా లో కూర్చొని వాడి ప్రశ్నలనే అలోచించసాగాడు. “ఎంత ధైర్యం వాడికి. నన్ను ముప్పయ్ రూపాయలు అడగడానికి నన్నే నీ సంపాదన ఎంత అని అడుగుతాడా? నేను రాత్రనక పగలనకా కష్టపడుతునంటే వీళ్ళకి ఆటలుగా ఉంది
ఒక గంట గడిచింది. సురేష్ కి కొపం తగ్గి, పండు మీద జాలి కలిగింది.
అనవసరంగా తిట్టినట్టున్నా వాడిని. ఎప్పుడూ వాడు నన్ను డబ్బులడగ లేదు. ముప్పయ్ రూపాయలతో ఎమన్నా అవసరమైంది కొనుక్కుంటాడేమోఅనుకుంటూ లోపలికెళ్ళాడు.
పండుపడుకున్నావా?”
లేదు డాడీ
నేను నిన్ను అనవసరంగా కోప్పడ్డాను. ఇవిగో తీసుకో ముప్పయ్ రూపాయలుఅని మూడు పది రూపాయల నోట్లు పండు చేతికిచ్చాడు.
డల్ గా ఉన్న పండు మొహం సంతోషం తో విప్పరింది. “థాంక్యూ డాడీఅని డబ్బులు చేతిలోకి తీసుకున్నాడు.
పరిగెత్తుకుంటూ తన స్కూల్ బాగు దగ్గరికెళ్ళి అందులోంచి కొన్ని రూపాయి బిళ్ళలు, రెండు రూపాయల బిళ్ళలు, అయిదు రూపాయల నోట్లు గుప్పిట్లోకి తీసుకున్నాడు.
అది చూసి సురేష్ కి మళ్ళీ కోపమొచ్చేసింది. “నీదగ్గర డబ్బులున్నాయి కద. మళ్ళీ ఎందుకడిగావ్?”
నా దగ్గర సరిపడ డబ్బులు లేవు డాడీ. అందుకే అడిగా. ఇప్పుడు సరిపడా ఉన్నయ్డాడీ, వంద రూపాయలతో నేను మీ దగ్గరనుండి ఒక గంట టైముని కొనుక్కోవచ్చా? రేపు ఆఫీసు నుండి ఒక గంట తొందరగా రండి డాడీ. మీతో కలిసి డిన్నర్ చేయాలని ఉంది
సురేష్ కి అప్పటిదాకా ఉన్న కోపం పూర్తిగా పోయి కళ్ళలో నీళ్ళు తిరిగాయ్. పండుని చేతుల్లోకి తీసుకోని గట్టిగా కౌగలించుకున్నాడు. “నన్ను క్షమించరా. డబ్బులు సంపాదించడానికి నన్ను నేను అమ్ముకుంటున్నాను అనుకున్నా. కానీ మీ సంతొషాణ్ణి కూడా అమ్ముతున్నానని అర్ధం అయింది. అయాం సారీ నాన్నఅయాం రెయల్లీ సారీ…”
               ……….

మనం రోజంతా కష్టపడి పనిచేస్తాం. పనిలో పడిమన ’అనుకున్న వాటిని ఎన్నో కోల్పోతున్నాం.

కనీసం కాసేపైనా మన విలువైన వంద రూపాయల సమయాణ్ణి మనల్ని ప్రేమించే వారికి పంచుదాం! వాళ్ళే చివరిదాకా మనం సంపాదించుకొనే నిజమైన ఆస్థి!

 untitled2.jpg

హొళి  శుభాకాంక్షలతో…

–వెన్నెల

ఫిబ్రవరి 27, 2008

పరీక్ష

ఒక రాత్రి నలుగురు M.B.A విద్యార్ధులు, తెల్లావారితే పరీక్ష ఉందన్న విషయం కూడా గుర్తులేకుండా
బాగా త్రాగి పడుకున్నారు. పరీక్షకు ఎలాగూ చదవలేదు కనుక ఒక పధకం ఆలోచించారు.
నలుగురు ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి” సార్, మేము రాత్రి స్నేహితుడి పెళ్ళి అని పక్కూరికి వెళ్ళాము.
తిరిగి వస్తుండగ కారు టైరు పంక్చరు అయింది. దాన్ని తోసుకుంటు వచ్చేసరికి చాల ఆలస్యం అయ్యింది.
కాబట్టి మేము ఏమి చదవలేక పోయాము” అన్నారు.
ప్రిన్సిపాల్ జాలి పడి ” సరె! మీకు మూడు రోజుల తరువాత పరీక్ష పెడతాను అన్నాడు.
ఆ మూడు రోజులు బాగా కష్టపడి చదివారు నలుగురు.  పరీక్ష రోజు రానే వచ్చింది.
ప్రిన్సిపాల్ ఒక ప్రశ్న పత్రం ఇచ్చి నలుగురిని నాలుగు వేరు వేరు గదుల్లో కుర్చొబెట్టి రాయమన్నాడు.
అందులొ రెండే ప్రశ్నలు ఉన్నాయి.
.

.

.
.
.
1  నీ పేరు:(2 మార్కులు)

2  మీరెళ్ళిన కారుకి ఈ టైరు పంక్చరు అయ్యింది  ……..?……..  (98 మార్కులు)

clip_image001.gif

ఫిబ్రవరి 26, 2008

కాళిదాసు కవిత్వం లేదు…మొత్తం నా పాండిత్యమే :)

సుభద్రార్జునీయం

సుఘన గాండీవమ్ము సిగ్గుపడి నవ్వుకొనె తనకన్న సన్నయిన నడుముజూసి
గగన సౌధమునేలు నెలరాజు చినబోయె సుకుమార సౌందర్య మోముజూసి
వగల సెగలను తాకి చలిగాలి వేడెక్కి వడగాలిగా మారి ఒడులుచుండె
పొగరున్న అధరాల మధురాలు చవిగోరె సమరమ్ము శృంగారమొకటికాగ!!

180px-ravi_varma-arjuna_and_subhadra.jpg 

అమల కాంచనమెల్ల అపురూపవతియయ్యె
సుమన సుస్వరమెల్ల గాత్రమయ్యె
విమల నేత్రము తోడ కమలాక్షి గానాయె
గమన హంసను గాన నిలువనాయె!!

ఫిబ్రవరి 23, 2008

నేను కవిని కానన్న వాణ్ణి…

నేను భీశ్మాచార్యుడిని. రధం మీద కూర్చొని, చేతిలో విల్లంబుల్తో చాల అందంగా ఉన్నాను. ఇంతలో సడెన్ గా ఎవరో శత్రు సైనికుడు వచ్చేసి సరిగ్గా గుండెలో గుచ్చుకొనేలా ఒక పెన్ను ని నా మీదకి సంధించాడు. కట్ చేస్తే నేను అంపశయ్య మీద..కాదు..కాదు..అంపశయ్య కాదు పెన్నుల మీద…భయం తో కెవ్వని కేక పెట్టి లేచి కుర్చున్నా. ఇదంతా కలా? పక్కన చూస్తే మా బాబిగాడు నా మీద కాలేసి చలనం లేకుండా నిద్ర పోతున్నాడు. రెండ్రోజులనుంచి ఒక పార్కర్ పెన్ను కొందామనుకుంటున్నా. ఈ కల దాని ఎఫెక్టేమో అనుకొని, పక్కన ఉన్న పెన్ను ని కొంచెం దూరంగా పెట్టి ధైర్యంగా అటుతిరిగి అంజనేయ దండకం చదువుతూ పడుకున్నా.

***************
ఒకాయనెవరో ఒక పత్రిక ఎడిటర్ కి “నేనెందుకు బ్రతికున్నాను?” అనే టైటిల్ తో కధ రాసి పంపిచ్చాడు. అది చదివిన ఎడిటర్ “పోస్టులో పంపావుగనక” అని రిప్లయ్ ఇచ్చాడట!

సినిమాళ్ళో చూసి నవ్వుకుంటాం గానీ కొన్ని కామెడీలు ట్రాజెడీ నుంచి పుడతాయన్న నిజం అనుభవించినవాళ్ళకే తెలుస్తుంది…

ఆ రోజుల్లో నేను మా మామయ్య అపాయింట్మెంట్లు చూసే వాణ్ణి. ఆ రోజు సాయంత్రం కూడా రోజులాగే ఆఫీసుకి వెళ్ళా. బైట రిసెప్షన్ లో కూర్చొని వచ్చిన వాళ్ళని షెడ్యూలు ప్రకారం లోపలికి పంపుతున్న.
ఇంతలో ఒక పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. తెల్లచొక్క, బూడిద రంగు పాంటు, చెదిరిపోయిన జుట్టు, మాసిన గడ్డం, భుజం మీద సంచితో  మనిషి మాంచి హుందాగా ఉన్నాడు. అందరిని పలకరించినట్టే నవ్వుతూ ఆయనని కూడా ‘యేస్, చెప్పండి?’ అన్నా. ‘ఇవాల సార్తోని అపాయింట్మెంటున్నది ‘
‘ఓహో..మీపేరు?’
‘రమణ ఎడిసాక ‘
‘ఎవరేడ్చాక?’
‘మా ఇంటిపేరు ఎడిసాక ‘
‘ఒహ్..ఇక్కడ రమణ అనే ఉందిలెండి.కూర్చొండి, మీ అపాయింట్మెంట్ టైం అవగానే పంపిస్తాను ‘
ఆయన నవ్వుతూ వచ్చి చేతిలో బాగు ని టేబుల్ మీద పెట్టి కుర్చిలో కూర్చున్నాడు.
‘నా పేరు రమణ ఎడిసాక ‘
‘హా ముందే చెప్పారు ‘ అన్న నవ్వుతూ.
‘నేను కడప నుంచి వచ్చినా’
నాకెందుకో ఖద్దరు చొక్కాలు, చేతిలో కత్తులు, వెనకాల గాల్లో మంటల మధ్య స్కార్పియోలు కనిపించాయ్. చ చ, ఆ మధ్య చూసిన బాలకృష్ణ సినిమాల ఎఫెక్టేమో. మళ్ళి వెంటనే తేరుకొని ‘ఓహో’ అన్నా.
‘నేను మొన్నటి దాక ఆస్పత్రిలో ఉన్న కదా. అందుకే ఇప్పుడు సార్ని చూద్దామని వచ్చినా
‘అయొ అవునా..ఎమైందండి..ఎమైన హెల్త్ ప్రాబ్లెమా?’
‘ఏ…హెల్త్ బానె ఉండె. మెంటల్ ఉండె కద..’
అంతే…పాత సినిమాలో చూపించినట్టు పక్షులు గాల్లో ఎగురుతూ ఆగిపోయినట్టు, సముద్రంలో అల అలాగే నిలిచిపొయినట్టు, అగ్ని పర్వతాలు బద్దలైనట్టు ఇంకా
రకరకాలుగా అనిపిచ్చింది. నాకసలే పిచ్చాళ్ళంటే చచ్చే బయ్యం మరి (అదొక విషాద గాధ..తరువాత చెబుతాన్లెండి).
సాధ్యమైనంత భయపడనట్టు నటిస్తూ ‘ఒహో’ అన్న.
‘ఇపుడేం పిచ్చి లేదు. తగ్గిపోయిందని ఆర్నెళ్ళ కిందటే పంపించేసారు ‘
‘నేను కవితలు రాస్తాను ‘ కాస్త గర్వం తొనికిసలాడింది ఆ గొంతులో
‘ఓహొ, అంటే మీకు పూర్తిగా నయమైపొయిందన్నమాటా’ అన్నా కాస్త స్థిమిత పడుతూ
‘అవును, మీరూ కొన్ని కవితలు వినండి ‘
‘ఇప్పుడవన్ని ఎందుకండి ‘
‘పర్లేదు, మీకు ఎన్ని కవితలు వినిపించినా తప్పులేదు ‘
ఎదొ అక్షర దోషం వినిపించింది. ఎందుకో నా మనసేదో కీడు శంకించింది. ఇంతలో మా బాబిగాడు లోపలికి వచ్చాడు.
‘మీకు తప్పకుండ నా కవితలు వినిపిస్తాను ‘ అనుకుంటూ బాగులోంచి ఒక గ్రంధాన్ని తీసాడు.

కనీసం ఒక 400 పేజీలు ఉంటుందనుకుంటా.
మా వాడు నా వైపు కొంచెం అయోమయంగ చూసాడు.
‘మీ దగ్గర పెన్నుందాండి?’ అని అడిగాడు. నా జేబులో లేక పోవడం చూసి మా బాబి
గాడి పెన్ను అడిగి తీసుకున్నాడు. హడావిడిగా ఆ పుస్తకంలోని ఒక పది పేజీలు
తిప్పి ‘హా ఇదె…వినండి ‘.
నా మొహం లో కాస్త టెన్షన్
“కలం…
ఈ కలం…ఒక కలం
ఈ కలం…అబ్దుల్ కలాం
ఈ కలం…ఒక కలం
ఈ కలం…కలకలం
ఈ కలం…ఒక కలం
ఈ కలం…వికలం…

… ” చెబుతూనే ఉన్నాడు. నా మొహం లో టెన్షన్, భయం గా రూపాంతరం చెందుతోంది…
కొంతకాలం గడిచాక …ఇక చివరకు మకారం వచ్చే తెలుగు పదాలేవి మిగలలేదని నిర్ధారించుకొని… ‘కవిత ఎలా ఉందండి?’ అన్నాడు.
నేను ఏం మట్లాడాలో తెలీక అలా చూస్తు ఉండి పొయాను.
అప్పుడే షాక్ నుండి తేరుకుంటున్న మ బాబి గాడు విరక్తిగ మొహం పెట్టి ‘ఈ కలం…దానిముందు మేము ఈకలం’ అన్నాడు.
‘చాల ధాంక్సండి, ఈ బుక్ నిండా అలాంటి కవితలే ఉన్నాయ్. మీకు ఇంకొన్ని వినిపిస్తాను ‘
మాంచి నిద్రలో ఉన్నవాడు భయంకరమైన కలొచ్చి లేచినట్టుగా మా బాబి గాడు
ఒక్క ఉదుకున లేచి “నే వెళ్తున్నారా..బాయ్” అని డోర్ వైపు వెళ్ళిపొతున్నాడు.
నాకేం అర్ధం కావట్లేదు. వెంటనే తేరుకొని ‘ఒరెయ్..నీ పెన్ను రా ‘ అన్నా.
‘పర్లేదు రా…రేపు ఉంటే తీసుకుంటాను ‘
మళ్ళీ ఎదో అక్షర దొషం వినిపించింది. నేనుంటేనా? పెన్నుంటేనా? దేని గురించి అన్నాడు వాడు?
ఇక్కడేమో ఈయన మరో కవితకి రెడీ అయిపొతున్నాడు.
ఎలా తప్పించుకోవాలీ విపత్కర పరిస్థితులనుంచి?

మరో నిముషం ఆ గ్రంధం మీద పరిశోధన జరిపాక ‘హా…ఇదే’ అన్నాడు.

నాకేమో మెల్లిగా చెమటలు పడుతున్నయ్, అసలే మొన్నటిదాక పిచ్చసుపత్రి లో ఉన్నా అన్నాడు.

ఎమన్నా అంటే ఎం జరుగుతుందో అని అచేతన స్థితిలో ఉండి పోయాను. 
ఇంతలో ముందు అపాయింట్మెంట్ అయిపోయినట్టు వచ్చే బెల్ మోగింది. వెంటనే 2 రోజులనుండి కాలుతున్న 1000 వాట్ బల్బులాగా ఉన్న నా బుర్రలొ పాదరసం ప్రవహించింది. ఇప్పటి అపాయింట్మెంట్ ఆపి వీడిని లోపలికి
పంపించేస్తె..? నేను వెంటనే కిచెన్లోకెళ్ళి అక్కడ వెంటిలేటర్ లోంచి దూకి పారిపోవచ్చు. అయొ ఆఫీసులో కిచెన్ లేదె…మేన్ డోర్ లొనుంచైనా సరే పారిపోవచ్చు..
అంతే ఆ ఆలోచన రాగానే వెంటనే “మీరు వెంటనే లోపలికి వెళ్ళండి” అనబోయేంతలో నా ముందు ఫోను మోగింది.
‘హెలొ ‘
‘హెలొ ‘
‘నా పేరు సుందర్ కుమార్. నేను కూచంపల్లి నుండి కాల్ చేస్తున్నను. కూచంపల్లి పేరు మీరు విని ఉండొచ్చు..కూ…’
‘విషయం చెప్పండి ‘
‘హ, అదే, కూచంపల్లి కొంచెం ఫేమస్ లెండి. మా ఊర్లో ఒక తాత పసరు మందు
వేస్తుంటాడు. కూచంపల్లి మెదక్ దగ్గర.. అంటే మెదక్ నుండి రెండు కిలొమీటర్ల దూరం లో ఉంటదీ
నాకు నోట్లో బూతులొస్తున్నయ్
‘మీకేంకావాలి ‘
అవతలి గొంతు కస్త అయోమయంగా ‘సార్ ఉన్నాడా?’
‘లేడు ‘ టక్కున పెట్టేసా ఫోను.
ఈ గ్యాపులో తరువాతి అపాయింట్మెంటు వాళ్ళు లోపలికెళ్ళిపొయారు. సప్త సముద్రాలు ఒంటి
చేత్తో ఈది ఇంటి ముందున్నమురిక్కాలువలో పడి చచ్చాట్ట వెనకటికొకడు.
వీడేమో ఎప్పుడు నేను ఫోను పెట్టేస్తానా అని గోతి కాడీ నక్క లాగా ఎదురు చూస్తున్నాడు.
వెంటనే మొదలెట్టాడు.
“బంధువులు…
బంధువులు…రా బంధువులు…
రారా బంధువులు..పోపో బంధువులు…
వాళ్ళా బంధువులు.. వీళ్ళా బంధువులు..
ఆ బంధువులు రా బంధువులు…
ఈ బంధువులు పో బంధువులు…”
There are only two seasons in Hyderabad. Hot…and Very Hot…
చమటలు పట్టేస్తున్నయ్…గొంతు ఆరిపొతున్న ఫీలింగ్..
ఈ వెధవ ప్రపంచం తో నాకేం సంబంధం లేదు…అన్నట్టుగా చెప్పుకుపోతున్నాడు వీడు.
ఎదో ఒకటి చెయాలి..ఎం చేయాలి?
అలోచిస్తూనె అటువైపు చూసా..సరిగ్గా రెండు సెకన్లు గుండె కొట్టుకోడం మర్చిపోయింది…బాగా ఫాం లోకొచ్చినట్టున్నాడు, పుస్తకం పక్కన పెట్టి ఆశువుగ చెప్పుకుపోతున్నాడు.
“ఎం బంధువులు…ఎందుకు బంధువులు.
అందుకా బంధువులు..ఇందుకా బంధువులు..
రాకపోతే బంధువులు…పోకపోతే బంధువులు”
నా వల్ల కావట్లేదు. ఇంకాసేపు ఇలాగె ఉంటే నేను కచ్చితంగా ఎర్రగడ్డ హాస్పిటల్కి కస్టమర్ గా మారిపోతాను.
ఇంతలో మళ్ళి బెల్లు మోగింది. మెదడు లో పాదరసం ఇంక ఆలస్యం చేయలేదు. వెంటనే “మీరెళ్ళండి లోపలికి” అన్నా. తరువాతి అపాయింట్మెంట్ వాళ్ళు ఎదో అనబోయి నా మొహం చూసి పాపంలే అనుకుని కూర్చున్నారు.
ఆ దేవుడి దయ వల్ల అంత శ్రుతిలో ఉన్నవాడుకూడ తన కవితా సునామిని ఆపి “సరేనండి” అని లేచి లోపలికి వెళ్ళాడు.

మళ్ళి పక్షులు ఎగురుతున్నాయ్… అలలు పొంగటం మొదలెట్టాయ్.. అగ్ని పర్వతాలు యధాస్థానానికి వచ్చేసాయ్.
రెండు గంటల నుండి ఊపిరి బిగబట్టిన వాడు ఒక్కసారి నిశ్వసించినట్టు ఉఫ్ఫ్ఫ్ఫ్ఫ్ అన్నా.

అంతలోనే మళ్ళీ టెన్షన్ మొదలైంది…ఇపుడు లోపలికి వెళ్ళినవాడు మళ్ళీ బైటకి రాకుండా ఉంటాడా…వచ్చి మళ్ళీ మొదలెడితే???

ఫిబ్రవరి 14, 2008

వాలెంటైన్ కధ…

ఫిబ్రవరీ 14 న ప్రపంచమంతా వాలెంటైన్స్ డే గా జరుపుకుంటారు. అసలు ఎవరీ వాలెంటైన్..ఏమా కధ?

పురాతన రోమ్ లో ఫిబ్రవరీ 14 ని జూనో దేవత పండుగగా జరుపుకొనే వారు. జూనో దేవత రోమ్ లోని దేవతలకు రాణి. ఆమెని పెళ్ళిళ్ళకి, అమ్మయిలకి అధిదేవత గా అనుకొనే వారు. ఫిబ్రవరీ 14 తరువాత రోజు అంటే ఫిబ్రవరీ 15 ని లూపర్కాలియ పండుగగా (the Feast of Lupercalia) జరుపుకొనేవారు. ఆ రోజు రోమన్ అమ్మాయిల పేర్లన్ని చీటీలుగా రాసి ఒక డబ్బా లో వేసేవారు. ప్రతి అబ్బాయి ఆ డబ్బాలోంచి ఒక అమ్మాయి పేరు తీయాలి. ఆ అమ్మయి అతనికి భాగస్వామి అవుతుంది. తరువాత వాళ్ళు ఆ దేవత ముందు పెళ్ళి చేసుకునేవారు.

మూడవ శతాబ్ధం లో రోమ్ దేశాన్ని పాలిస్తున్న రాజు పేరు క్లాడీస్ II. (Emperor Claudius II ). ఒక కౄరుడైన రాజు గq అతనికి పేరు. రాజ్య కాంక్ష ఎక్కువ. తన సైన్యాణ్ణి పెద్దదిగా చేసి పక్క రాజ్జ్యాలను జయించాలని కలలు కనేవాడు. కానీ ఆ దేశం లోని యువకులంతా ప్రేమించాలని, పెళ్ళిళ్ళు చేసుకొని సంతొషంగా ఉండాలని ఆశ పడేవారు. ఇది నచ్చని క్లాడీస్ II రోమ్ లో పెళ్ళిని, ప్రేమ ను నిషేధించాడు.

సెయింట్ వాలెంటైన్ వృత్తి రీత్యా ఒక వైద్యుడు ప్రవృత్తి రీత్య క్రైస్తవ మత ప్రచారకుడు. ప్రేమ అనేది ముఖ్యమైనది అని నమ్మే వ్యక్తి. క్లాడీస్ II నిర్ణయాలు వాలెంటైన్ కి నచ్చలేదు. తనకు సాధ్యమైనంత మేరకు ప్రేమ ను ప్రచారం చేయసాగాడు. సయింట్ మారీస్ తొ కలిసి అతను దొంగతనంగా చర్చిల్లో పెళ్ళిళ్ళు చేయించేవాడు. ఈ విషయం తెలిసిన క్లాడీస్ II వాలెంటైన్ ని చెరలో వేయించాడు. అను చేసిన రాజధిక్కారానికి మరణ శిక్ష విధించాడు.

కానీ అప్పటికే వాలెంటైన్ గురించి చాల ప్రచారం జరిగింది. అతడిని ఒక దేవుడి ప్రేమ దూతగ ప్రజలు అనుకోడం మొదలుపెట్టారు.

వాలెంటైన్ జైల్ లో ఉండి కూడా, ఇంకొన్ని రోజుల్లో మరణిస్తానని తెలిసి కూడా ప్రేమ ప్రచారం ఆపలేదు. అక్కడున్న ఒక చెట్టు (రాగి చెట్టు లాంటిది-నిజానికి ప్రేమ కి గుర్తుగా వాడే ‘హార్ట్’, గుండె కి గుర్తు గా వచ్చింది కాదు. ఆ ఆకు కి గుర్తు గా వచ్చింది) ఆకులని తెంపి వాటిపై ప్రేమ ఎంతో గొప్పదని, ప్రేమ లేనిదే ప్రపంచం లేదని, ప్రేమ కి అపజయం లేదు లాంటి వాక్యాలని రాసి జైలు గోడ అవతల పారేసే వాడు. వాటిని ఆ జైల్ జైలరు కూతురు తీసుకెళ్ళి ప్రజలకు చేరవేసెది. తను చనిపోయే రోజు ఆ అమ్మయికి వాలెంటైన్ “With love Valentaine” అని రాసి ఇచ్చాడు.

క్రీ.శ. February 14, 269 నాడు వాలెంటైన్ కి శిరచ్చేదం జరిగింది. తరువాతి కాలం లో పోప్ అతడిని దేవుడి ప్రేమ దూతగ చెబుతూ “సెయింట్ వాలెంటైన్” గ పిలిచారు. February 14 ని ప్రేమికులదినంగా జరుపుకోడం అప్పటినుంచే మొదలైంది.

hearts-clip.gif

Happy Valentine’s Day

జనవరి 25, 2008

ఎవరు నీవు?

A Friend?

         A Lover?

                 A Companion?

                           A Fellow Adventure?

                                     Or U my soul Mate?

This is the way you make me feel!!!

heart-01-june.gif

జనవరి 12, 2008

కలకువ

[హాస్యం]
Anantaraaman Subbaraaman అనే ఒక వ్యక్తి న్యూ యార్క్ విమానాశ్రయం లో తన వీసా కోసం ఎదురుచూస్తున్నాడు.  అరగంట గడిచింది…గంట గడిచింది…రెండు గంటలు దాటింది.
ఇక లాభం లేదు తెల్లోళ్ళని దులిపేద్దామని లోపలికెళ్ళి అడిగాడు ఎందుకు నా పేరు పిలవట్లేదు మీరు అని.
వాళ్ళు పాపం అమాయకంగా సమాధానం ఇచ్చారు..మేము మిమ్మల్ని గత రెండు గంటల నుండి పిలుస్తూనే ఉన్నం కదా Mr. Anotherman Superman.

జనవరి 12, 2008

సంక్రాంతి శుభాకాంక్షలు

untitled.jpg

డిసెంబరు 15, 2007

శుభాకాంక్షలు

telugu-talli.jpg

           మిత్రులందరికీ తెలుగు బ్లాగరు దినోత్సవ శుభాకాంక్షలు

నవంబరు 8, 2007

కల

పొద్దున్నే కాఫీ చేతికిస్తూ భర్త తో అంది భార్య వయ్యరంగా.
“ఏవండీ..నాకు రాత్రి ఒక కల వచ్చింది. మీరు నాకు రవ్వల నెక్లెస్ కొనిచ్చినట్టు. దానర్ధం ఎంటడి?”
“ఆహ..సాయంత్రం దాక వెయిట్ చెయ్యి. నీకె తెలుస్తుంది”
ఆనందం తో మాట రాలేదు ఆమెకి. ఆపూట ఇళ్ళంతా నీట్ గా సర్దేసింది. సాయంత్రానికి తను కూడా రెడీ అయిపోయి భర్త కోసం గుమ్మం దగ్గర నిలబడి చూస్తోంది.
ఆయన రాగానే చేతిలోంచి బ్యాగ్ లాక్కెళ్ళి లోపల పెట్టి వేడి వేడి గా కఫీ తీసుకొచ్చి చేతిలో పెట్టింది.
చిరు మంద హాసం తో తను కూడా ఒక గిఫ్ట్ ప్యాక్ తీసి చేతికిచ్చాడు భర్త. ఛక చక దాన్ని తెరచి చూసింది ఆమె మెరిసే కళ్ళతో. 
అందులో “కలలు-వాటి అర్ధాలు” అనే పుస్తకముంది
దీపావళి శుభాకాంక్షలు 
:-)